20 December 2024
19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల హీరోను పెళ్లి చేసుకున్న హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు, తమిళం, మలయాళం భాషలలో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 19 ఏళ్ల వయసులోనే 31 ఏళ్ల స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు. నజ్రీయా నజీమ్. 20 డిసెంబర్ 1994న తిరువనంతపురంలో నసీముద్దీన్, బెకంపినా దంపతులకు జన్మించారు.
చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన నజ్రీయా.. 2013లో మలయాళ చిత్రం మట్ దత్ ద్వారా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.
తమిళంలో రాజా రాణి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. నజ్రీయా అప్పట్లో యాక్టింగ్ విభాగంలో నటుడు దుల్కర్ సల్మాన్ కంటే సీనియర్.
2014లో బెంగుళూరు డేస్ చిత్రంలో నజ్రియా నటించింది. ఇందులో నస్రియా కజిన్స్‌గా దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలీ నటించగా.. ఫహద్ ఫాజిల్ భర్తగా నటించారు.
ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2014లో తల్లిదండ్రుల అంగీకారంతో ఆగస్టు 21న పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి సమయంలో నజ్రీయా వయసు 19 సంవత్సరాలు కాగా.. ఫహద్ ఫాజిల్ వయసు 31 ఏళ్లు. అప్పట్లో వీరిద్దరి వివాహం చర్చనీయాంశంగా మారింది.
పెళ్లైన నాలుగేళ్లకు తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నాని సరసన అంటే సుందరానికి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది నజ్రీయా.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్