30 September 2025

సెకండ్ ఇన్నింగ్స్‏లో జెనీలియా జోరు.. అమ్మాడి ఆస్తులు ఎంతో తెలుసా..

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో జెనీలియా ఒకరు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించి.. తనదైన నటనతో చెరగని ముద్ర వేసింది. 

ముంబైలో జన్మించిన జెనీలియా డిసౌజా ఆమె కాథలిక్ కుటుంబానికి చెందిన అమ్మాయి. పాఠశాల సంవత్సరాల్లో రాష్ట్ర స్థాయి అథ్లెట్, జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి. 

2003లో తుఝే మేరీ కసమ్  సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. కానీ బొమ్మరిల్లు సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. 

తెలుగు, హిందీ, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన ఆమె ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సిద్ధార్థ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

2012లో తన తొలి సహనటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది.

ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ శఇ్తింది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.140 కోట్లకు పైగా ఉన్నాయట. ఎక్కువగా యాడ్స్ ద్వారా సంపాదిస్తుందట ఈ బ్యూటీ.

చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. మరాఠీ చిత్రం వేద్ తో తిరిగి నటనలోకి అడుగుపెట్టింది. 2022లో రితేష్ దర్శకుడిగా అరంగేట్రం చేశారు. 

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఆమె.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. అలాగే ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట ఆకట్టుకుంటున్నాయి.