20 January 2025

5 సినిమాలు చేస్తే 2 హిట్టయ్యాయి.. క్రేజ్ మాత్రం వేరేలెవల్..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్న, శ్రీలీల, మీనాక్షి చౌదరి వంటి హీరోయిన్స్ హవా నడుస్తోంది. కానీ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. 

హీరోయిన్‏గా ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కట్ చేస్తే.. తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా మారింది.

ఇప్పటివరకు తెలుగులో 5 సినిమాల్లో నటించింది. కానీ ఆ చిత్రాల్లో కేవలం 2 మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరంటే.. 

తనే హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 

తెలుగులో లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, మత్తు వదలరా 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో మొత్తం 5 సినిమాల్లో నటించింది ఫరియా అబ్దుల్లా. కానీ కేవలం రెండు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. కానీ క్రేజ్ ఎక్కువే.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఫరియా. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ.. అటు గ్లామర్ డోస్ పెంచేసి ప్రేక్షకులను కవ్విస్తుంది. 

తెలుగులో ఇప్పుడు సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది ఫరియా. అలాగే ఈ బ్యూటీకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే.