23 June 2025

16 ఏళ్లకే ఫేక్ వీడియోస్... 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలనటిగా స్టార్ హీరోల సినిమాల్లో కనిపించి ప్రేక్షకులకు దగ్గరైంది. 

ఆ తర్వాత సైతం నటన ప్రపంచంలోనే కొనసాగింది. కానీ 16 ఏళ్లకే ఫేక్ వీడియోస్ బారిన పడింది. కట్ చేస్తే 18 ఏళ్లకే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. 

ఇంతకీ ఈ భామ ఎవరో తెలుసా.. ? తనే అనిక సురేంద్రన్. చిన్నవయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించింది. 

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్  కూతురిగా విశ్వాసం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళంలో స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. 

16 ఏళ్లకే సైబర్ నేరగాళ్ల చేతిలో పడి ఫేక్ వీడియోస్ సమస్యను ఎదుర్కొంది. బుట్టబొమ్మ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. 

ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం చూస్తుంది. 

ఇటీవలే ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మా నీకు అంత కోపమా సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. తమిళంలో చాలా యాక్టివ్. 

అలాగే సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.