07 October 2024

హీరోయిన్ శ్రియా గురించి మీకు తెలియని విషయాలు.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు శ్రియ. తెలుగులో స్టార్ హీరోలతో ఎన్నో హిట్ మూవీస్ చేసింది. 

హరిద్వార్‌లో పుట్టి పెరిగిన నటి శ్రేయ.. చిన్నవయసులోనే కథక్, రాజస్థానీ నృత్యాలను నేర్చుకుంది. ఎన్నో డ్యాన్స్ షోస్ చేసింది. 

అలా డ్యాన్స్ షోలో పాల్గొంటున్న సమయంలోనే రామోజీ ఫిలింస్ నిర్మాణ సంస్థ మేకర్స్ తమ సినిమాలో శ్రేయకు అవకాశమిచ్చారు. 

తెలుగు ఇష్టం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్డన భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. 

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్, విక్రమ్, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో కనిపించింది. 

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. హిందీ సినిమాల వైపు అడుగులు వేసింది. దీంతో దక్షిణాదిలో ఈ బ్యూటీకి ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయాయి. 

2018 మార్చి 19న తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొస్చీవ్ ను వివాహం చేసుకుంది శ్రియా. వీరికి 2021లో జనవరి 10న పాప జన్మించింది. 

చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రియా.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.