Kiran Rathod Pic

బిగ్ బాస్ నుంచి కిరణ్ రాథోడ్ అవుట్..

11 September 2023

Bigg Boss Season 7

అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న రియాలిటీ షో  బిగ్ బాస్ సీజన్ 7 మొదలై వారం పూర్తయ్యింది. ఇందులో ఒకరు ఎలిమినేట్ అయ్యారు.

Kiran Rathod In Pink Saree

ఊహించినట్టుగానే నటి కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ హౌస్ కి దూరమయ్యారు. 14మంది కంటెస్టెంట్స్ లో మొదటి వారం ఈమె బయటకు వచ్చేసింది.

Kiran Rathod In Saree

ఎనిమిది మంది నామినెట్ అవ్వగా తెలుగు రాదనే ఒక కారణంగా ఈమె కొనసాగలేకపోయింది. హౌస్ లోని వారితో కూడా అంతగా కలవలేకపోయింది.

ఆదివారం నాగ్ హౌస్ లో అందరితో గేమ్స్ ఆడించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చివరిగా కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అని చెబుతూ స్టేజ్ పైకి రప్పించారు.

స్టేజ్ పైకి వచ్చిన ఆమె హౌస్ లో  ఉన్నవారి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా ప్రిన్స్ యావర్ పై కొన్ని వ్యాఖ్యలు చేసింది.

ఆదివారం బిగ్ బాస్ 7 ఎపిసోడ్ లో సందీప్ పవర్ అస్త్రాన్ని అందుకుని వీఐపీ రూమ్ యాక్సెస్ ను సంపాదించుకున్నారు.

సీదా కంటెస్టెంట్స్ ఎవరు.? ఉల్టా కంటెస్టెంట్స్ ఎవరు.? అని కిరణ్ రాథోడ్ ను ప్రశ్నించారు కింగ్ నాగార్జున.

దానికి జవాబుగా ఆమె యావర్ చాలా మంచివాడు అతడు సీదా అని తెలిపింది. షకిలా హౌస్ లో వారందరిలో చాలా మంచి వ్యక్తి అని కిరణ్ చెప్పింది.