12 September 2023

దెబ్బకు తోక ముడిచిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం! అందుకే తొందరొద్దనేది..!

Pic credit - Instagram

రిజెల్ట్‌తో సంబంధం లేకుండా.. వరుస సినిమాల్లో యాక్ట్ చేసుకుంటూ పోతున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.

తాజాగా ఈ యంగ్ హీరో రతినమ్ క్రిష్ణా డైరెక్షన్లో.. రూల్స్ రంజన్ సినిమాతో మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అందుకోసం ఓ మాంచి రిలీజ్ డేట్ కోసం.. ఎప్పటి నుంచో ఆరా తీస్తున్నారు కిరణ్ అబ్బవరం.

ఇక ఈక్రమంలోనే సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ డేట్ వాయిదా పడడంతో.. ఆ డేట్‌కే రూల్స్ రంజన్ సినిమాను తీసుకొస్తన్నామంటూ.. అనౌన్స్ చేశారు.

సెప్టెంబర్ 28నే రూల్స్ రంజన్ రిలీజ్ అంటూ.. తన స్టైల్లో అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు యూట్యూబ్‌లోనూ ప్రమోష్స్ మొదలెట్టారు.

కానీ సెప్టెంబర్ 28నే రామ్‌ పోతినేని స్కంద, రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 రిలీజ్‌ అవుతుండడంతో.. తాజాగా వెనకడుగు వేశారు.

స్కంద, చంద్రముఖిలు రెండూ పాన్ ఇండియన్ సినిమాలు కావడంతో.. వాటి మధ్య థియేటర్లు దక్కడం కష్టం అంటూ... రియలైజ్ అయ్యారు కిరణ్.

దీంతో రూల్స్ రంజన్ రిలీజ్‌ను ... కాస్త ముందకు అంటే.. అక్టోబర్ 6కు పోస్ట్ పోన్ చేశారు. 

ఇక ఈ న్యూస్ బయటికి రావడంతో.. అందుకే తొందరొద్దు అంటూ.. కొంత మంది నెటిజెన్లు.. కిరణ్ అబ్బవరానికి చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు.