కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు పెద్ద చిక్కు.. ఇలా జరిగింది ఏంటి..? 

30 May 2024

ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో దూసుకుపోతున్నాడు కమెడియన్ ఆర్పీ.

యాక్టింగ్ ను కంప్లీట్‌గా పక్కనబెట్టి.. కేవలం బిజినెస్‌పైనే ఫోకస్ పెట్టాడు. హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాడు.

అయితే.. ఆర్పీ చేపల పులసు స్టార్ట్ చేసినప్పటి నుంచి.. రేటు బాగా ఎక్కువ అనే కామెంట్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి.

ఆ విషయాన్ని స్వయంగా అంగీకరిస్తున్నాడు ఆర్పీ. క్వాలిటీ చేపలు తెప్పిస్తానని, నెల్లూరు స్టైల్ వంట కాబట్టి ఆ మాత్రం ఖర్చ అవుతుందని అంటున్నాడు.

అది పక్కనబెడితే.. ఫుడ్ ఆర్డర్ పెట్టే ఆన్‌లైన్ వేదికల్లో ఆర్పీ పెట్టిన నెల్లూరు చేపల పులుసుకు దారుమైన రేటింగ్స్, కామెంట్స్ వస్తున్నాయి.

పెట్టే డబ్బుకు.. వారు అందించే టేస్ట్.. క్వాంటిటీ చాలా దారుణంగా ఉందటున్నారు. క్వాలిటీ విషయంలో కూడా చాలా నిరుత్సాహపరిచారని పేర్కొంటున్నారు.

అటు స్విగ్గీ, జొమాటోతో పాటు జస్ట్ డయల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఇలాంటి కామెంట్సే కనిపించాయి. కావాలని ఆర్పీని టార్గెట్‌ చేస్తున్నారా.? లేదా జన్యూన్ రివ్యూస్ అన్నది తెలియాల్సి ఉంది.

తన ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్లే.. ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యాడు ఆర్పీ. క్వాలిటీ లేకపోతే ప్రజలు ఎందుకు ఇంతలా ఆదరిస్తారని ప్రశ్నిస్తున్నాడు.