రాత్రి కియారా చూసే వీడియోలు అవే.! దేవర సెట్లో జాన్వీ అన్న మాటకి అందరు షాక్.!
TV9 Telugu
04 February 2024
బాలీవుడ్ నటి కియారా అద్వానీ రోజులో చేసే ఆఖరి పని ఏంటో తెలుసా? వీడియోలు చూడటం. కొన్నిసార్లు మోటివేషన్ కోసం వీడియోలు చూస్తారట కియారా అద్వానీ.
నిద్ర ముంచుకొస్తున్నా సరే, కాస్త ఆగి ఇన్‌స్టాగ్రామ్‌లో 'బి ఫిట్' వీడియోస్ చూసి పడుకుంటారట. ఉదయం నిద్ర లేవగానే వాటన్నిటినీ చూసేయాలని ఫిక్సయిపోతారట.
కానీ తీరా నిద్రలేచాక, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? రోజూ నేను చేసేవే చేస్తే పోతుందిగా అని తనకు తాను సర్ది చెప్పుకుంటారట ఈ బ్యూటీ.
త్వరలోనే తెలుగులో రామ్ చరణ్ సరస ఆమె హీరోయిన్ గా నటిటీషున్న గేమ్ చేంజర్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు కియారా.
అతిలోక సుందరి శ్రీదేవి, తన ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ని ఏమని తిట్టేవారో తెలుసా? 'నా కొడకా' అని అట. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ ఓపెన్‌గా చెప్పింది.
జాన్వీ కపూర్ చిన్నతనంలో శ్రీదేవి గదిలోకి వెళ్లి రెండు జేబుల నిండా లిప్‌స్టిక్స్ నింపుకుని వెళ్లేదాట.
'జేబులో ఏంటి?' అని అడిగితే 'ఏం లేదు అమ్మా' అని జాన్వీ దాచే ప్రయత్నం చేసేదాట. కూతురి పరిస్థితి అర్థం చేసుకున్న శ్రీదేవి 'నా కొడకా' అని తిడుతూ ముద్దుచేసేవారట.
దేవర సెట్లో తనకు తెలియకుండానే 'నా కొడకా' అనే పదం వడిందట జాన్వీ. అందరు 'మీకు తెలుగు వచ్చా' అని అడిగితే, 'ఏమో.. ఎప్పుడో విన్న మాట అలా వచ్చేసింది' అని చెప్పిందట.