ఆ కోలీవుడ్ స్టార్ హీరోకు జోడీగా కియారా అద్వానీ .. 

Rajeev 

04 June 2024

బాలీవుడ్ బ్యూటీ కియారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో చేసింది.

మహేష్ తర్వాత రామ్ చరణ్ తో కలిసి నటించింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ అయ్యింది. 

ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. 

ఇక ఇప్పుడు ఈ అమ్మడు మరోసారి రామ్ చరణ్ తో కలిసి నటిస్తుంది. గేమ్ ఛేంజర్  సినిమాలో నటిస్తుంది. 

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పుడు మరో హీరోతో నటిస్తుంది. 

కియారా అద్వానీ ఇప్పుడు  కోలీవుడ్ హీరోతోనూ రొమాన్స్ కి రెడీ అయ్యిందని టాక్ వినిపిస్తుంది.

తాజాగా ధ‌నుష్ హీరోగా న‌టిస్తోన్న మ‌రో చిత్రానికి కియారా అద్వానీ ఎస్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది.