ప్రాజెక్టులు ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తేనే ఒప్పుకుంటా.. కియారా..
08 September 2023
పుట్టి పెరిగింది నార్త్ లో అయినా, ఎక్కువ సినిమాలు చేస్తున్నదీ అక్కడే అయినా మనకు కియారా ఎప్పుడూ నార్త్ లేడీగా కనిపించరు.
మన అమ్మాయి అనే ఫీలింగ్‌లోనే ఉంటాం. అందుకే ఏ స్టార్ హీరో సినిమా స్టార్ట్ అయినా, హీరోయిన్ల లిస్టులో కియారా పేరు తప్పకుండా కనిపిస్తుంటుంది.
ఇన్నాళ్లూ ఓ రకంగా సాగితే, ఇప్పుడు లైఫ్ ఇంకో రకంగా ఉందా? అని హీరోయిన్ కియారాను చాలా మంది అడుగుతున్నారట.
అలా ఉండదు... ఇన్‌ఫ్యాక్ట్ గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఎక్కవగా కష్టపడాల్సి వస్తుందని చెబుతున్నారు మేడమ్ కియారా.
అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ తను ప్రొఫెషనల్‌గా ఉండటానికే ట్రై చేస్తానన్నారు. మనసుకు ఎంతో నచ్చితేగానీ సినిమాకు సైన్ చేయనని చెప్పారు.
డబ్బుల కోసం తానెప్పుడూ అవకాశాలను అందిపుచ్చుకోలేదని అన్నారు. ప్రాజెక్టులు ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తేనే ఒప్పుకుంటానని అన్నారు.
ఎంతో కష్టపడి చేసిన సినిమాలు కొన్నిసార్లు సరిగా ఆడవు. అలాగని ఆగిపోకూడదు. జడ్జిమెంట్ మీద అనుమానాలు పెట్టుకోకూడదు.
మళ్లీ మళ్లీ మనసుకు నచ్చిన కథలే చేయాలి. ఎందుకంటే థియేటర్‌లో కూర్చుని చూసేది కూడా నాలాంటి సినీ లవర్సే అని అంటారు కియారా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి