ఆ హీరోయిన్ భర్తతో చనువుగా రాశి ఖన్నా.. ఫ్యాన్స్ ఫైర్..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతుంది. ఇన్నాళ్లు తెలుగులో సినిమాలు చేసిన ఈ బ్యూటీకి ఇప్పుడు హిందీలో ఆఫర్స్ వస్తున్నాయి.
బీటౌన్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.
అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ జిందగీ తేరే నామ్ పాటను ఇటీవల జైపూర్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి వెళ్లే సమయంలో రాశి ఖన్నా చేసిన పనికి కియారా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
యోధ ప్రమోషన్స్ సమయంలో రాశి ఖన్నా సిద్ధార్థ్ చేతిని పట్టుకుని నడిచింది. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్స్ నుంచి ఆమె ఇబ్బంది పడకుండా చూశాడు సిద్ధార్థ్. ఈ వీడియో వైరలవుతుంది.
సిద్ధార్థ్ చేతిని పట్టుకుని రాశీ ఖన్నా నడిచింది. తర్వాత అతడు తన చేతిని విడిపించుకుని.. ఆమె చేయి పట్టుకుని నడిచాడు. దీంతో రాశిపై కియారా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరూ ఎందుకు చేయి పట్టుని నడుస్తున్నారు ?.. కేవలం మీరిద్దరు సహా నటీనటులు మాత్రమే.. సిద్ధార్థ్‌తో ఇలా ప్రవర్తించడం మాకు నచ్చడం లేదంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు.
సిద్ధ్ చాలా మర్యాదగా ఉన్నాడు.. కేవలం రాశి మాత్రమే అతడి చేతులు పట్టుకుంది.. ఆ తర్వాత ఆమెకు జాగ్రతగా ఉండాలని అతడు నడిచాడు అంటూ మరో అభిమాని కామెంట్ చేశాడు.
సిద్ధార్థ్ చేతులు విడిచిపెట్టి నడిచాడు.. కానీ రాశి అలాగే చెయి పట్టుకుని నడవడానికి ప్రయత్నించింది.. అవసరమా ? అంటూ మరో అభిమాని నెట్టింట అసహనం వ్యక్తం చేశాడు.