దానికోసం పదిరోజుల కష్టపడ్డాను.. కియారా కామెంట్స్ వైరల్.

Anil Kumar

21 May 2024

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. ప్రజెంట్ తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ తో దూసుకుపోతుంది ఈ అమ్మడు.

వరస సినిమాలతో, వెబ్ సిరీస్ లతో అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

అంతేనా..? ఇక పలు యాడ్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నదానికి చాలా బ్రాండ్లు ఆమెతో టై అప్ అయ్యాయి.

ఇదిలా ఉంటె ఈ అమ్మడు తెలుగులో శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీకి సంబంధించి జరగండి.. జరగండి.. సాంగ్ రిలీజ్ అయ్యింది. దీనిపై కియారా మాట్లాడుతూ కామెంట్స్ చేసింది.

తాను ఇప్పటిదాకా చేసిన పాటలన్నీ ఒక ఎత్తు, గేమ్‌ చేంజర్‌లో పాట మరో ఎత్తు అని అన్నారు నటి కియారా అద్వానీ.

జరగండి పాటకు రామ్‌చరణ్‌తో స్టెప్పులేశానని చెప్పారు. దాదాపు పది రోజుల పాటు ఈ పాటకు పనిచేసినట్టు తెలిపారు.

షూటింగ్ ముందు కొద్దీ రోజులు రిహార్సల్స్ చేసుకోవడం వల్ల పాట పర్ఫెక్ట్ గా వచ్చిందని అన్నారు నటి కియారా.