TV9 Telugu
యానిమల్ సినిమా విజయం ఆశ్చర్యానికి గురి చేసింది: ఖుష్బూ..
28 Febraury 2024
దేశంలో నెంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ రెండో ఎడిషన్ మొదటి రోజు ఆదివారం ఖుష్బూ సుందర్ పాల్గొన్నారు.
సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తన తల్లి పట్ల తన తండ్రి వ్యవహరించిన తీరును నటి ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ సమ్మిట్ లో మరోసారి గుర్తుచేసుకున్నారు.
తన తల్లి పరిస్థితి చూసి ఎప్పుడూ నిస్సహాయురాలిగా మారకూడదని అనుకున్నానని తెలిపారు ప్రముఖ నటి ఖుష్బూ సుందర్.
తమ తల్లి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. ఎప్పటికీ ఒక నిస్సహాయ మహిళగా మారకూడదని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది.
అలాగే ఇటీవల విడుదలైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ చిత్రంపై కూడా స్పందించారు నటి ఖుష్బూ.
యానిమల్ సినిమా విజయం కావడం ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగానే ఉందని. ప్రజల ఆలోచనల గురించి మనం ఏమి చెప్పగలమన్నారు ఖుష్బూ.
యానిమల్ లాంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూడడానికి ఇష్టపడుతున్నారు. సినీ ప్రేక్షకుల మనస్తత్వమే ఇప్పుడు సమస్య.
ఇక్కడ క్లిక్ చెయ్యండి