రాఖీ భాయ్ మళ్లీ రావడం మాత్రం పక్కా అంటున్న కేజియఫ్ మేకర్స్..

11 December 2023

ఓ సినిమా విడుదలయ్యాక.. మహా అయితే ఆర్నెళ్లు గుర్తు పెట్టుకుంటారు. కానీ ఏడాదన్నరైనా దానిపై అంతే క్రేజ్ ఉందంటే మాత్రం.. అది కచ్చితంగా అద్భుతమే.

అలాంటి మ్యాజిక్ ఎప్రిల్ 14, 2022న విడుదలైన కేజియఫ్‌తో చేసారు ప్రశాంత్ నీల్.  ఏడాదిన్నర అయినా కూడా వార్తల్లోనే ఉంది.

అందులోనూ కేజియఫ్‌ పార్ట్ 3కి సంబంధించిన అప్‌డేట్ గురించి ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. కేజియఫ్‌ పార్ట్ 3 ఉందని గతేడాదే దర్శక నిర్మాతలు ప్రకటించారు.

1978 నుంచి 1981 వరకు రాఖీ భాయ్ ఎక్కడున్నారు అనేది ఇందులో లైన్ అని.. 181 దేశాల్లో ఆయన చేసిన క్రైమ్స్‌తోనే పార్ట్ 3 ఉంటుందని లీడ్ ఇచ్చారు.

తాజాగా కేజియఫ్ 3పై మరో అప్‌డేట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. దాంతో పార్ట్ 3కి ముహూర్తం సెట్ అయిందని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

కేజియఫ్ 3 స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయిందని.. అయితే దానికి దర్శకుడు తానుంటారా.. మరొకరు ఉంటారా అనేది మాత్రం తెలియదంటున్నారు ప్రశాంత్ నీల్.

అయితే దర్శకుడిగా తాను ఉన్నా లేకపోయినా యష్ మాత్రం ఉంటారని తేల్చేసారు ప్రశాంత్. అదిప్పుడు ఉంటుందా.. తర్వాత తెరకెక్కుతుందా అనేది మాత్రం సస్పెన్స్.

కాస్త లేటైనా రాఖీ భాయ్ మళ్లీ రావడం మాత్రం పక్కా. ఆ మధ్య విడుదలైన కేజియఫ్ 2 వన్ ఇయర్ ట్రైలర్‌లోనూ పార్ట్ 3కి లీడ్ ఇచ్చారు మేకర్స్.