24 March 2024
TV9 Telugu
నా పై అలాంటి తప్పుడు రాతలు రాశారు: కేజీఎఫ్ ఫేమ్ రవీనా
05 April 2024
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఫేక్ న్యూస్ లు ఎక్కువయ్యాయి. ఈ ఫెక్ న్యూస్ ల వల్ల సెలబ్రెటీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్‌కి కూడా ఈ విషయంలో ఇబ్బంది పడ్డారంట. తనపై తప్పదు వార్తలు రాశారని తెలిపింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవీనా ఈ విషయాన్నీ తెలిపింది. రవీనా టాండన్ 1991లో పత్తర్ కే ఫూల్ మూవీతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.
2022 కేజీఎఫ్ 2 లో రమికా సేన్ పాత్రతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. రవీనాకు సోషల్ మీడియాలోను బాగా ఫాలోయింగ్ ఉంది.
1998లో రవీనా అనారోగ్యం కారణంగా 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ..
బడే మియా చోటే మియా సినిమా షూటింగ్ టైంలో ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆ నెలలో నా గురించి రకరకాల వార్తలు వచ్చాయి.
ఓ ప్రముఖ పత్రిక నాపై తప్పుడు వార్తలు రాసింది. నేను డ్రగ్ తీసుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డా అని రాశారు..
మా వాళ్ళు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడిగే వారు. వాళ్లందరికీ ఏం జరిగిందో వివరించాను’ అని రవీనా తెలిపింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి