4 ఏళ్లలో ఒక్క హిట్టు.. అయినా తగ్గని క్రేజ్.. స్టార్ హీరోలతో ఛాన్సులు
Rajitha Chanti
Pic credit - Instagram
అందం, అభినయం ఉన్నప్పటికీ చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కంటిన్యూ కాలేకపోతున్నారు. ఇందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు.
సినీరంగంలోకి అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతున్నప్పటికీ ఒక్క హిట్టు కూడా అందుకుంది. కానీ ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. వరుసగా స్టార్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటుంది.
ఆ బ్యూటీ మరెవరో కాదు.. హీరోయిన్ కేతిక శర్మ. 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
ఆ తర్వాత లక్ష్య్, రంగ రంగ వైభవంగా, బ్రో సినిమాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీ ఖాతాలో ఒక్క హిట్టు పడలేదు. ఇటీవలే శ్రీవిష్ణు సరసన సింగిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.
వరుసగా సినిమాల్లో నటించినప్పటికీ ఈబ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కానీ గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట ఫాలోయింగ్ పెంచుకుంది. అలాగే ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కొత్త సినిమాలు ఏవి లేవు. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ చేసిన స్పెషల్ సాంగ్ పై విమర్శలు వచ్చాయి.
అటు సినిమాలు లేకపోయినా ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ నెట్టింట గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి.
మొదట్లో యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసిన కేతిక.. ఆ తర్వాత రొమాంటిక్ సినిమాతో కథానాయికగా మారింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో సరైన ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది.