కేరింత సినిమాలో భావన.. అలియాస్ సుకృతి ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా.?

Anil Kumar

12 May 2024

2015 లో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసి.. కుర్రకారుని తన వైపు తిప్పుకున్న సినిమా "కేరింత".

ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. అందులోని పాత్రలు కూడా చాలామందికి ఇప్పటికి గుర్తుండే ఉంటాయి.

మరీ ముఖ్యంగా అందులోని నూకరాజు , భావన క్యారెక్టర్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి.

అయితే ఈ మూవీలో భావన గా కనిపించిన "సుకృతి అంబటి".. ఈ సినిమాతో ఈ అమ్మడు అప్పట్లో యూత్ క్రష్ గా నిలిచింది.

తమ నేచురల్ యాక్టింగ్ తో ప్రశంసలు అందుకున్న ఈ వయ్యారి.. ఆ తర్వాత కంప్లీట్ గా సినిమాలకు దూరమయ్యారు సుకృతి.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన నటీనటులలో సుకృతి కూడా ఒకరు అని చెప్పొచ్చు.

కారణాలు తెలియదు కానీ.. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన ఈ అమ్మడు 2022 లో వివాహం చేసుకున్నారు.

సోషల్ మీడియాలో తన ఫొటోస్ తో యూత్ ఎంటర్టైన్ చేస్తున్న సుకృతి మళ్లీ మూవీస్ చెయ్యాలని కోరుకుంటున్నారు ఈమె ఫ్యాన్స్.