ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్‌లో అవకాశాల కోసం కష్టపడుతున్న అదా శర్మ

Rajeev 

21 June 2025

Credit: Instagram

హాట్ బ్యూటీ అదా శర్మ. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయం అయ్యింది.

ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది.

సినిమా కోసం ఎలాంటి సాహసాలు అయినా చేస్తుంది ఆ చిన్నది.. బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ వరుసగా సినిమాలు చేస్తుంది

బాలీవుడ్ లో లేడీ ఓరియేంటేడ్ సినిమాలతో పాపులర్ అయ్యింది ఈ భామ. అదా శర్మ నటించిన కేరళ స్టోరీ సినిమా భారీ హిట్ గా నిలిచింది.

ముందుగా వివాదంలో చిక్కుకున్నప్పటికీ ఆతర్వాత ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అలాగే ఈ సినిమా భారీ వసూళ్లను కూడా రాబట్టింది

ప్రస్తుతం బాలీవుడ్ లోనే పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఈ వయ్యారి భామ. సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు వదులుతుంది.

ఇప్పుడు అక్కడ కూడా ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయి. ఇటు తెలుగులోనూ అవకాశాలు అందుకోలేకపోతుంది ఈ చిన్నది.