బాలీవుడ్ కోసం రిస్క్ చేస్తోన్న కీర్తి.. ఫ్యాన్స్ ఓకే అంటారా ?
TV9 Telugu
Pic credit - Instagram
కీర్తి సురేష్.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తమిళ్, తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
ఇన్నాళ్లు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కీర్తి.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె ఫస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతుంది.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ జోడిగా 'బేబీ జాన్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడు వరుణ్ తో లిప్ లాక్ సన్నివేశాల్లో కనిపించనుంది టాక్.
తెలుగు, తమిళ్ సినిమాల్లో ఇప్పటివరకు చాలా సినిమాలు చేసింది కీర్తి. కానీ ఏ హీరోతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించలేదు. అందుకు కారణాలు తెలియదు.
కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ కోసం రిస్క్ చేస్తుంది కీర్తి. తొలిసారి అమ్మడు లిప్ లాక్ సన్నివేశాలు చేస్తుంది. అలాగే ఓటీటీలో అక్క అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది.
ఇందులో ఏకంగా రాధిక ఆప్టేతో కలిసి కనిపించనుంది. అన్ని రకాలుగా సంసిద్ధమయ్యే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కీర్తి అడుగుపెడుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఇన్నాళ్లు ట్రెడిషనల్ లుక్ లో.. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తెలుగువారికి దగ్గరయ్యింది.
కానీ ఇప్పుడు బాలీవుడ్ కోసం కీర్తి పూర్తిగా మారిపోతుంది. మరీ సరికొత్త కీర్తిని ఫ్యా్న్స్ యాక్సెప్ట్ చేస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. కీర్తి ఫుల్ బిజీగా ఉంది.