మళ్లీ తెరపైకి కీర్తి పెళ్లి వార్తలు.. ఇప్పట్లో ఆగేలా లేవుగా..
Rajitha Chanti
Pic credit - Instagram
సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తన ప్రతిభతో స్టార్ డమ్ అందుకుంది కీర్తి సురేష్. బాలనటిగా రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు గుర్తింపు తెచ్చుకుంది.
ఎన్న మాయం సినిమాతో కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మకాం మార్చేసింది. తెలుగులో నేను శైలజ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది.
మొదటి సినిమాతో హిట్ అందుకున్నా.. ఆ తర్వాత వచ్చిన మహానటి మూవీతో తెలుగు ప్రేక్షకులు, విమర్శకులతో ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఆమె కెరీర్ను మలుపు తిప్పింది.
మహానటి సినిమాలో కీర్తి నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. స్టార్డ్ డమ్ అందుకుంది.
తెలుగు, తమిళం, మలయాళం, భాషల్లో వరుసగా స్టార్ హీరోలతో కలిసి నటించింది కీర్తి. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. మరోసారి కీర్తి పెళ్లి తెరపైకి వచ్చాయి.
ఇప్పటికే అనేకసార్లు కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ కీర్తి పెళ్లి త్వరలోనే జరగనుందని టాక్ నడిచింది.
అలాగే కీర్తి స్నేహితుడితో ఆమె జరుగుతుందని మరో రూమర్ నెట్టింట వైరలయ్యింది. అయితే తమ కూతురు పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు కీర్తి పేరెంట్స్.
ఇప్పుడు మరోసారి కీర్తి పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. గత 13 ఏళ్లుగా తన స్నేహితుడితే కీర్తి ప్రేమలో ఉందని.. త్వరలోనే అతడితో పెళ్లి జరగనుందని అంటున్నారు.