మరో లెజెండ్ బయోపిక్ లో  నటించనున్న కీర్తిసురేష్ ..

Rajeev 

23 May 2024

 కీర్తిసురేష్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది కీర్తి. 

నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా ఈ చిన్నది వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 

మహానటి సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను మరింత దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. 

సావిత్ర జీవిత కథను డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్లకు కట్టినట్లు చూపించారు. కీర్తి అద్భుతంగా నటించింది. 

ఈ మహానటి మరో లెజెండరీ స్టార్ సింగర్ బయోఫిక్‌లో నటించడానికి రెడీ అవుతోంది.

స్టార్ సింగర్ దివంగత ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో స్టార్ట్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించబోతున్నట్లు టాక్.

ఎం.ఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో కీర్తి సురేష్ నటించబోతున్నారని కోలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.