సొగసుతో హిమశిఖరాలను కూడా కరిగిస్తుందేమో ఈ భామ.. సిజ్లింగ్ కీర్తి..

Prudvi Battula 

Credit: Instagram

04 February 2025

17 అక్టోబర్ 1992న కేరళలోని తిరువనంతపురం జన్మించింది కీర్తి సురేష్. ఆమె తండ్రి సురేష్ కుమార్ మలయాళీ చిత్ర నిర్మాత, తల్లి మేనక అలనాటి కథానాయిక.

టాలీవుడ్ ఇండస్ట్రీకి నేను శైలజ చిత్రంతో అరంగేట్రం చేసిన కీర్తి సురేష్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తర్వాత న్యాచురల్ స్టార్ నానికి జోడిగా నేను లోకల్ చిత్రంలో హీరోయిన్‌గా అందం, అభినయంతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత మహానటి అనే తెలుగు చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించింది. ఈ చిత్రంతో నేటితరం మహానటిగా మారింది.

2022లో మహేష్ బాబుకి జోడిగా సర్కార్ వారి పాట చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.

2023లో దసరా చిత్రంలో పూర్తి డీగ్లామర్ పాత్రలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి హిట్ అందుకుంది. అదే ఏడాది భోళా శంకర్ మూవీ కనిపించింది.

2024లో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కనిపించనప్పటికీ ప్రభాస్ కల్కి మూవీలో బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆకట్టుకుంది.

తెలుగు సినిమాల్లో కొద్దీ రోజుల్లో స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది ఈ వయ్యారి భామ.