మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది కీర్తి సురేష్. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.
ఇక ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. బీటౌన్ స్టార్ హీరో వరుణ్ ధావన్ జోడిగా కీర్తి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి.. తన కాలేజీ రోజులను గుర్తుచేసుకుంది. ఆ సమయంలో ఒక పోకిరికి బుద్ది చెప్పిన ఘటన గుర్తు చేసుకుంది.
నటిగా పరిచయం కానీ సమయంలో ఒకరోజు అర్దరాత్రి తాను స్నేహితురాళ్లతో కలిసి వెళ్తున్నాని.. అప్పుడు ఒక మందుబాబు వెనక వచ్చి రాసుకుంటూ వెళ్లాడట.
దీంతో తనకు కోపం వచ్చిందని.. వెంటనే అతడిని పట్టుకుని చెంపలు పగలకొట్టినట్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మందుబాబు తనపై దాడి చేసి తలపై కొట్టడాని తెలిపింది.
దీంతో అతడిని పోలీసులకు అప్పగించినట్లు గుర్తుచేసుకుంది కీర్తి. పోలీసులు అతడిని రాత్రి అంతా జైలులోనే ఉంచి ఉదయం విడిచిపెట్టారని గుర్తుచేసుకుంది కీర్తి.
ప్రస్తుతం కీర్తి జయం రవి నటిస్తున్న సైరన్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ కోసం పది కిలోల బరువు పెరిగిందట. ఈనెల 16న అడియన్స్ ముందుకు రానుంది.