13 February 2024

ప్రేమికుడిని తలుచుకుని కీర్తి ఎమోషనల్

TV9 Telugu

కీర్తి సురేష్‌కు ఇప్పటికే వేలల్లో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. ఎన్నో రకాలుగా తమ ప్రేమను బయటపెట్టేందుకు ట్రై చేసిన వారుంటారు.

కానీ ఇప్పటికీ కీర్తి వద్ద మాత్రం ఓ ప్రేమలేఖ ఉందట. దానిని ఎంతో భద్రంగా దాచుకున్నానంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ఈ క్రమంలో నెట్టింట తారల లవ్ స్టోరీ ముచ్చట్లకు సంబంధించిన వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.

ఈ క్రమంలోనే కీర్తికి సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో కీర్తి ఏం చెప్పారంటే..!

"కెరీర్ ఆరంభంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కోసం వెళ్లాను. అప్పటికే నేను వస్తున్నాను అన్న సంగతి తెలిసి అక్కడి చాలా మంది చేరుకున్నారు.

ఇంతలో ఆ గుంపులో నుంచి ఓ అబ్బాయి ముందుకు వచ్చాడు. వస్తూనే నా చేతిలో ఓ పెద్ద పుస్తకం పెట్టాడు. ఆ సమయంలో నన్ను ఎలాంటి అసౌకర్యానికి గురి చేయలేదు.

చేతిలో పుస్తకం పెట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అందులో నాకు సంబంధించిన ఫోటోలతోపాటు ఓ ఉత్తరం ఉంది.

తనను పెళ్లి చేసుకోమని ఆ అబ్బాయి రాసిన ప్రేమలేఖ చూసాను. అందులో తన వివరాలు కూడా ఉన్నాయి. అబ్బాయి ఫోటో, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని ఉన్నాయి.

ఆ లెటర్ చదివి షాక్ అయ్యాను. కాసేపటికి నవ్వుకున్నాను. ఫస్ట్ లవ్ లెటర్ కావడంతో ఇప్పటికీ నా దగ్గరే భద్రంగా దాచుకున్నాను.