03 November 2024

లవ్యూ డార్లింగ్.. అతడికి కీర్తి సురేష్ స్పెషల్ విషెస్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. 

ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం హిందీలో వరుణ్ ధావన్ సరసన ఓ సినిమా చేస్తుంది కీర్తి..

బేబీ జాన్ అనే టైటిల్‏తో రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది కీర్తి. ఈ మూవీ అట్లీ తేరికి రీమేక్. 

ఇటీవలే సైరెన్, రఘుతాత చిత్రాలతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది కీర్తి. కానీ ఆ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 

ఇదిలా ఉంటే.. కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కీర్తి సురేష్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లకు దగ్గరవుతుంది. 

తాజాగా  ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు రిప్లై ఇచ్చింది కీర్తి. ఈరోజు నా పుట్టినరోజు.. నీ నుంచి విషెస్ ఆశిస్తున్నాను అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. 

కీర్తిని ట్యాగ్ చేస్తూ లవ్యూ డార్లింగ్.. ఈరోజు నా బర్త్ డే నీ నుంచి ట్వీట్ ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు ఓ నెటిజన్స్. ఆ ట్వీట్ నెట్టింట వైరలయ్యింది. 

ఇక దానికి సమాధానం ఇచ్చింది కీర్తి సురేష్. లవ్యూ టూ డార్లింగ్.. హ్యాపీ బర్త్ డే అంటూ రిప్లై ఇవ్వడంతో సదరు అభిమాని గాల్లో తేలిపోయాడు.