TV9 Telugu

17 February 2024

ఆ హీరో సినిమాలో లిప్ కిస్ లు.. నో చెప్పిన కీర్తి సురేష్.!

తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న భామల్లో కీర్తిసురేష్ ఒకరు. నేను శైలజా సినిమాతో పరిచయం అయ్యింది.

ఆతర్వాత వచ్చిన సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సినిమాలో నటించి ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకుంది కీర్తి సురేష్. ఆతర్వాత ఈ బ్యూటీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఇదిలా ఉంటే ఓ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉందన్న కారణంగా కీర్తిసురేష్ ఓ యంగ్ హీరో మూవీ ఛాన్స్ ను వదులుకుందట.

ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కీర్తి మొదటి నుంచి గ్లామర్ కంటెంట్ కి నో చెప్తూనే వచ్చింది.

కీర్తిసురేష్ కెరీర్ స్టార్టింగ్ లో నితిన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందట. ఆ సమయంలో ఈ చిన్నదానికి అది పెద్ద ఆఫర్.

అయితే ఆ సినిమాలో లిప్ కిస్ సీన్స్ , రొమాన్స్ ఉన్న సన్నివేశాలు ఉండటంతో ఆ సినిమాకు నో చెప్పిందట కీర్తి సురేష్.

నితిన్ తో నటించడం ఇష్టమే కానీ లిప్ లాక్ సీన్స్ వల్లే ఆ సినిమాను వద్దన్నదట. ఆ తర్వాత ఈ ఇద్దరూ రంగ్ దే అనే సినిమాలో నటించారు.