10 August 2024
నేను సింగిల్ అని ఎప్పుడూ చెప్పలేదుగా.. కీర్తి సురేష్ కామెంట్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కీర్తి సురేష్. తాజాగా రఘుతాత సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది.
ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి తన లవ్ గురించి కామెంట్స్ చేసింది.
మీరు సింగిల్ గా ఉంటున్నారు కదా..? బోర్ కొట్టట్లేదా అని ఓ విలేకరి అడగ్గా.. రిలేషన్ షిప్ గురించి మొదటి సారి రియాక్ట్ అయ్యింది.
నేనేప్పుడు సింగిల్ అని చెప్పలేదుగా అంటూ బాంబ్ పేల్చింది. అలాగే తన పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ పై కామెంట్స్ చేసింది.
ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ జీవితాన్ని కొనసాగించడమే పెళ్లి అని తన భావన అని చెప్పుకొచ్చింది కీర్తి.
కెరీర్ ప్రారంభంలో తాను నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద పరాజయం అయ్యాయని దీంతో తననే విమర్శించారని చెప్పుకొచ్చింది.
తన సినిమాలన్ని ప్లాప్ కావడంతో అనేక ట్రోల్స్ ఎదుర్కొన్నానని మహనటి తర్వాత తనపై ట్రోల్స్, విమర్శలు తగ్గించారని తెలిపింది.
విమర్శలను స్వాగతిస్తానని.. వివరణాత్మక విమర్శల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని కావాలని కామెంట్స్ చేస్తారని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.