28 November 2025
కీర్తి సురేశ్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? ఏడాది సంపాదన ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ మలయాళీ కుట్టి.
మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది కీర్తి.
ఇప్పుడు రివాల్వర్ రీటా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. నవంబర్ 28న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే.
ఇదెలా ఉంటే.. నివేదికల ప్రకారం కీర్తి సురేశ్ ఆస్తులు రూ.50 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అలాగే ఆమె నెలకు రూ.35 లక్షలు సంపాదిస్తుంది.
అంతేకాదు రూ.15 కోట్లు సంపాదిస్తుందని సమాచారం. సినిమా ప్రాజెక్టులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపార రంగంలో భారీగానే సంపాదిస్తుందట.
కీర్తి ఒక్కో సినిమాకు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేస్తుంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా దాదాపు రూ. 30 లక్షలు సంపాదిస్తుందని టాక్.
సోషల్ మీడియా స్పాన్సర్‌షిప్‌ల ద్వారా దాదాపు రూ. 25 లక్షలు వసూలు చేస్తుందట. అలాగే కీర్తి దగ్గర ఖరీదైన లగ్జరీ కార్లు, హ్యాండ్ బ్యాగ్స్ సైతం ఉన్నాయట.
కీర్తి సురేష్ భర్త ఆంటోనీ థట్టిల్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. అతడి ఆస్తులు రూ.150 కోట్లు ఉన్నట్లు టాక్. దుబాయ్, కొచ్చిలో రెస్టారెంట్స్ ఉన్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్