17 October 2025

కీర్తి సురేష్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? కార్ కలెక్షన్ చూస్తే షాకే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

కీర్తి సురేష్.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది ఈ ముద్దుగమ్మ. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది కీర్తి.

ఒకప్పుడు చెన్నైలో ఫ్యాషన్ స్టూడెంట్ అయిన కీర్తి.. కాలేజీ రోజులోలలో జరిగిన ఫ్యాషన్ షోలో రన్అవే హెమ్‌లైన్‌లను ఫిక్సింగ్ చేయడం ద్వారా కేవలం రూ. 500 సంపాదించింది.

ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకు దాదాపు రూ.4 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. నివేదికల ప్రకారం కీర్తి సురేష్ ఆస్తుల విలువ రూ.41 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

అలాగే ఆమె నెలకు దాదాపు రూ.35 లక్షల వరకు సంపాదిస్తుంది. అంటే సంవత్సరానికి రూ.15 కోట్లక.. ఒక్కో సినిమాకు 4 కోట్లు, ప్రచారానికి రూ.30 లక్షలు తీసుకుంటుందట.

ఇన్ స్టోలో ఒక్కో పోస్ట్ కు రూ.25 లక్షలు సంపాదిస్తుంది. కీర్తి సురేష్ రూ. 1.38 కోట్ల విలువైన BMW 7 సిరీస్, రూ. 81 లక్షల విలువైన మెర్సిడెస్-బెంజ్ AMG GLC43

రూ. 60 లక్షల విలువైన వోల్వో S90 కార్లు ఉన్నాయి. ఇటీవల బేబీ జాన్ సినిమాతో హిందీ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు రూ.4 కోట్లు తీసుకుందట. 

కీర్తి సురేష్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన్ చిత్రంలో నటిస్తుంది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే.

అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ క్రేజీ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటింది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.