12 May 2025
కీర్తి సురేష్ ఎంత ఆస్తులు సంపాదించిందో తెలుసా..? రెమ్యునరేషన్ ఎంతంటే
Rajitha Chanti
Pic credit - Instagram
దక్షిణాదిలోని టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవలే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. భారీ అంచనాల మధ్య విడదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.
ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ ఆస్తులు దాదాపు రూ.41 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.
అలాగే ఒక్కో ప్రకటన చేయడానికి దాదాపు రూ.30 లక్షలు పారితోషికం తీసుకుంటుందట. ఇటీవలే తన స్నేహితుడితో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
తన స్నేహితుడు ఆంటోని థాటిల్తో కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న కీర్తి ఇటీవలే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది.
కీర్తి భర్త ఆంటోని ఆస్తుల విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అతడు దుబాయ్, కొచ్చిలో లగ్జరీ రెస్టారెంట్స్ కలిగి ఉన్నట్లు సమాచారం.
ఇక కీర్తికి చెన్నైలో ఒక ఇల్లు ఉంది. హైదారాబాద్లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.
కీర్తి వద్ద రూ.1.38 కోట్ల విలువైన BMW 7 సిరీస్ 730 LD, మెర్సిడెస్-బెంజ్ AMG GLC 43, వోల్వో S90, టయోటా ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్