23 November 2025

కీర్తి సురేశ్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగు సినిమా ప్రపంచంలో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలోనూ నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. 

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. 2013లో గీతాంజలి అనే సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్.

ఆ తర్వాత నేను శైలజ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి.. సావిత్రి బయోపిక్ మహానటి మూవీతో తెలుగులో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది.

దీంతో ఈ బ్యూటీ కెరీర్ మారిపోయింది. తెలుగుతోపాటు తమిళంలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్  సంపాదించుకుంది.

నివేదికల ప్రకారం కీర్తి సురేశ్ ఆస్తులు రూ.50 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. అలాగే నెలకు రూ.35 లక్షలు, సంవత్సరానికి రూ.15 కోట్లు సంపాదిస్తుందట.

సినిమాలు మాత్రమే కాకుండా ఎండార్స్‌మెంట్‌లు,  బ్రాండ్ ఒప్పందాల ద్వారా సంపాదిస్తుంది. ఆమె ఒక సినిమాకు దాదాపు రూ.4 కోట్లు తీసుకుంటుదని టాక్.

అలాగే ఒక్క యాడ్ కోసం రూ.30 లక్షలు వసూలు చేస్తుంది. ఇన్ స్టాల్లనూ ఈ బ్యూటీ ఎక్కువగానే సంపాదిస్తుందట. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తుంది కీర్తి సురేష్.

కీర్తి వద్ద 60 లక్షల  వోల్వో S90, 1.38 కోట్ల BMW 7 సిరీస్ 730Ld, 81 లక్షల మెర్సిడెస్ బెంజ్ AMG GLC43, 25 లక్షల టయోటా ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి.