సుహాస్ సరసన మహానటి.. కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్ ఏంటంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
కీర్తిసురేష్ చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ ప్రకటించడం లేదు. న్యాచురల్ స్టార్ నాని సరసన దసరా సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత చిరు సినిమాలో మెరిసింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లిగా కనిపించింది. ఆ తర్వాత లీడ్ రోల్ పోషించే మరో సినిమాను ఈ బ్యూటీ ఇంతకు అనౌన్స్ చేయలేదు.
ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో సరసన అలరించేందుకు రెడీ అయ్యింది. కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ ఇప్పుడు బ్యాక్ టూ బ్యూక్ హిట్ చిత్రాలతో హీరోగా దూసుకుపోతున్నారు.
ఇప్పుడు సుహాస్, కీర్తి సురేష్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ రానుంది. ఈ చిత్రానికి ఉఫ్పు కప్పురంబు అంటే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ ఐవీ శశి డైరెక్షన్ చేయనున్నారు.
వసంత్ మురళీ, కృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు. ఓ గ్రామంలోని స్మశానం విస్తరణ నేపథ్యంలో ఉప్పుకప్పురంబు సినిమా కథనం ఉంటుందనే ప్రచారం నడుస్తుంది.
అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్, సుహాస్ జంటగా నటిస్తారా ?లేదా ? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అనౌన్స్ చేయాల్సి ఉంది.
కీర్తి సురేష్, సుహాస్ జంటగా సినిమా అని తెలియగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కానీ ఇందులో కీర్తి హీరోయిన్ గా కనిపించనుందా ?.. లేదా అతిథి పాత్ర అనేది తెలియరాలేదు.
ప్రస్తుతం కీర్తి హిందీలో ఓ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న కోలీవుడ్ హిట్ మూవీ థేరీ రీమేక్ లో కీర్తి సురేశ్ నటిస్తుంది.