కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగులో మహానటి సినిమాతో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.
కీర్తి సురేష్ బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. మలయాళం సినిమా అయిన 'గీతాంజలి' మూవీతో కథానాయికగా పరిచయమైంది.
ఇక్కడ కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడం వల్ల ఈ ముద్దుగుమ్మ మంచి ప్రోత్సాహం లభించింది.
తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు తెచ్చుకుంది.
ఇక తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ రామ్ పోతినేని హీరోగా చేసిన 'నేను శైలాజా' నటించి తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది.
ఇక మహానటి సినిమాతో.. తెలుగు ప్రేక్షకులు గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె నటనకు జాతీయ అవార్డు నడుచుకుంటూ ఇంటికి వచ్చింది.
ఇక కీర్తి కెరీర్ విషయానికొస్తే.. వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఆమె సినిమాలు చేస్తుంది. రివాల్వర్ రీటా, బేబీ జాన్ సినిమాలు త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.