మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 'నేను శైలాజా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ.
కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో ఈమె బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ఇక తన సొంత భాష మలయాళ 'గీతాంజలి' మూవీతో కథానాయికగా పరిచయమైంది. 'ఇదు ఎన్న మాయమ్' మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
'నేను శైలాజా' తెలుగు తెరకు పరిచయమవగా తన నటన తో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్.
తెలుగులో కాస్త గ్యాప్‌తో పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' తో తన నటనతో జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది.
తాజాగా నాని సరసన దసరా మూవీతో హిట్ అందుకుంది. తర్వాత చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీలో చిరు చెల్లెలు చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.