తారలను బొమ్మగా మలచి.. వెన్నెలతో ఈమెకు ప్రాణం పోసాడేమో ఆ బ్రహ్మ..

20 November 2023

17 అక్టోబర్ 1992ను తమిళనాడు రాజధాని మద్రాస్ (ప్రస్తుతమ చెన్నై)లో జన్మించింది వయ్యారి భామ కీర్తి సురేష్.

ఈ బ్యూటీ తండ్రి జి. సురేష్ కుమార్ మలయాళీ చిత్రనిర్మాత. తల్లి మేనక తమిళ నటి. ఈమెకు రేవతి సురేష్ అనే అక్క ఉంది.

నాల్గవ తరగతి వరకు తమిళనాడులోని చెన్నైలో తర్వాత తిరువనంతపురంలోని పట్టంలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంది.

తర్వాత చెన్నైకి తిరిగి వచ్చే పెరల్ అకాడమీలో చదువుకుంది. ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పూర్తి చేసింది ఈ వయ్యారి.

నాలుగు నెలల పాటు స్కాట్‌లాండ్‌లో ఒక ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్, తర్వాత లండన్‌లో రెండు నెలల ఇంటర్న్‌షిప్ చేసింది ఈ భామ.

తర్వాత నటనలో వృత్తిని సంపాదించుకున్నప్పటికీ డిజైనింగ్‌ వృత్తివైపు వెళ్ళింది. ఈ బ్యూటీకి వయోలిన్ వాయించడం కూడా తెలుసు.

నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి చిత్రాల్లో కథానాయకిగా నటించింది.

తర్వాత మహానటి చిత్రంలో అలనాటి సావిత్రి పాత్రలో నటించి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఈ ఏడాది దసరాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది.