కీర్తిసురేష్ క్రేజ్ తగ్గిందా..? తెలుగులో ఆఫర్స్ రావడం లేదా.? 

Rajeev 

11 February 2025

 సినీరంగంలో హీరోయిన్ కీర్తి సురేష్ కు మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ  బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది అందాల భామ కీర్తిసురేష్.

తెలుగులో మహానటి సినిమాతు ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది. అలాగే ఎన్నో సినిమాల్లో నటించింది. 

తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు ఇటీవలే హిందీలోకి కూడా అడుగుపెట్టింది. కానీ ఆ ఎంట్రీ బెడిసికొట్టింది. 

ఇటీవలే బేబీ జాన్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. వరుణ్ ధావన్ హీరోగా  నటించిన ఈ సినిమా నిరాశపరిచింది. 

అంతే కాదు ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఈ చిన్నది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు స్పీడ్  తగ్గించింది. 

కాగా కీర్తిసురేష్ కు తెలుగు క్రేజీ ఆఫర్స్ రావడం లేదని టాక్ వినిపిస్తుంది. కొత్త హీరోయిన్స్ దూసుకుపోతున్న ఈ సమయంలో కీర్తికి తెలుగులో ఆఫర్స్ రావడం లేదని అంటున్నారు.