సినిమా ఇండస్ట్రీలో ఆ హీరోనే లవర్ బాయ్: కీర్తి సురేశ్
TV9 Telugu
17 August 2024
ఇప్పటివరకు దక్షిణాది సినిమాల్లోనే నటించింది మహానటీ కీర్తి సురేశ్. అయితే త్వరలోనే హిందీ సినిమాల్లోనూ మెరవనుందీ మలయాళ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది కీర్తి సురేశ్. విజయ్ నటించిన తేరీ రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
కాలీస్ దర్శకత్వంలో రానున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న గ్రాండ్ గా విడుదల కానుంది.
అంతకంటే ముందు కీర్తి సురేశ్ నటించిన రఘుతాత సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది కీర్తి సురేశ్. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఇందులో భాగంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తన అభిమానులతో షేర్ చేసుకుంటోంది.
ఈ సందర్భంగా బేబీజాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కీర్తి ఇప్పటి హీరోల్లో వరుణ్ ధావనే లవర్ బాయ్ అని కితాబిచ్చింది.
అలాగే అనుష్క చాలా మంచి వ్యక్తి అని, ఆమెను తాను కూడా స్వీటి అని ముద్దు పేరుతో నే పిలుస్తానని చెప్పుకొచ్చింది కీర్తి సురేశ్.
ఇక్కడ క్లిక్ చేయండి..