రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన ‘మహానటి !!
పాత్రల కోసం మేకోవర్ అయ్యే నటిమణుల్లో కీర్తి సురేష్ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగులో ‘మహానటి’ చిత్రంలో దివంగత మహా నటి సావిత్రి నిజజీవిత పాత్రతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు.
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి.
వాటిలో కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు, స్టార్స్‌తో జత కట్టిన చిత్రాలు కూడా ఉన్నాయి.
కాగా ఆ మధ్య సరైన సక్సెస్ లేక కీర్తీసురేష్ కొంత వెనుకబడ్డారు. దీంతో తెలుగులో అవకాశాలు కొరవడ్డాయి.
అయితే తమిళంలో ఇప్పుడు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు.
హిట్స్ ఉత్సాహాన్నే కాదు పారితోషికాన్నీ పెంచుతాయి. కీర్తిసురేష్ ఇందుకు అతీతం కాదు.
తన పారితోషికాన్ని ఇప్పుడు భారీగా పెంచేసిందని సమాచారం.
ఇంతకు ముందు చిత్రానికి రూ.2 కోట్లు తీసుకుంటున్న ఈ భామ ఇప్పుడు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
ఇక్కడ క్లిక్ చేయండి