చాప్టర్ క్లోజ్ అయిందన్నారు.. మహానటిపై దారుణ కామెంట్స్
ప్రతి మనిషికి జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే. ఇక్కడ ఏదీ నిరంతరం కాదు జయాపజయాలు అంతే.
కీర్తిసురేష్ విషయానికొస్తే చాలా తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకున్నారు.
అదేసమయంలో పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
ఆరంభ దశలోనే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అలాంటి పీక్ సమయంలో మరింత స్లిమ్‌గా తయారవడానికి కసరత్తులు చేశారు.
ఫలితంగా చాలా దారుణమైన విమర్శలకు గురయ్యారు.
కీర్తిసురేష్ ముఖంలో గతంలో ఉన్న గ్లామర్ పోయిందని, ఇక ఈమె చాప్టర్ క్లోజ్ అని దారుణమైన కామెంట్స్‌ను ఎదుర్కొన్నారు.
అయితే అదేముఖంతో తమిళంలో సాని కాగితం అనే చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
అయితే తెలుగులో ఆ సమయంలో ఆమె నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన రీతిలో ఆడలేదన్నది వాస్తవం.
ఆ తర్వాత మళ్లీ సరికొత్త అందాలను సంతరించుకున్న కీర్తిసురేష్ ఇప్పుడు వరుసగా సక్సెస్‌లను అందుకుంటున్నారు.