02 June 2024

బీటౌన్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న కీర్తి.. ఆ విషయంలో తగ్గేదే లే

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ బీటౌన్‏లో బిజీగా ఉంటుంది కీర్తి.

బీటౌన్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తోన్న బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీతో హిందీ ప్రేక్షకులను పలకరించనుంది. 

ప్రస్తుతం కీర్తి సురేష్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది. కీర్తి పారితోషికం పెంచేసిందట. 

ఇప్పుడు కీర్తి నటిస్తోన్న బేబీ జాన్ సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఉంటాయని డైరెక్టర్ ముందే చెప్పాడట. ఇందుకు కీర్తి ఆలోచనలో పడిందట. 

చాలా రోజులు ఆలోచించిన తర్వాత ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే లిప్ లాక్ కోసం డబుల్ రెమ్యునరేషన్ అని టాక్.

తాజా సమాచారం ప్రకారం బేబీ జాన్ సినిమా కోసం కీర్తి సురేష్ ఇప్పుడు రూ.6 నుంచి రూ. 8 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది టాక్. 

అలాగే బేబీ జాన్ సినిమాలో కీర్తి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించనుందని సమాచారం. అలాగే గ్లామర్ రోల్ కూడా పోషించనుందని సమాచారం.