కాబోయే పెళ్లి కూతురు కీర్తి సురేశ్ అసలు ఏం చదువుకుందో తెలుసా?
11 December 2024
Basha Shek
మహానటి కీర్తి సురేశ్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. గురువారం (డిసెంబర్ 12)న ఆమె వివాహం జరగనుంది.
గోవా వేదికగా తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతోందీ అందాల తార.
ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక కీర్తి కూడా తన పెళ్లి వేడుకకు సంబంధించిన అప్ డేట్స్ ను షేర్ చేస్తోంది.
గోవాలోని ఒక ప్రముఖ రిసార్ట్‌లో ఈ పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాలు గోవా చేరుకున్నాయి.
కాగా తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, పనులను కీర్తి సురేశ్ - ఆంటోనీ తాటిల్ నే దగ్గరుండి చూసుకుంటున్నారట.
ఈ క్రమంలో కీర్తి సురేష్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.
కీర్తి చెన్నైలో పుట్టి 4వ తరగతి వరకు అక్కడే చదువుకుంది. ఆ తర్వాత తిరువనంతపురంలోని పట్టం కేంద్రీయ విద్యాలయంలో ఉన్నత చదువు పూర్తి చేసింది.
ఇక ఫ్యాషన్ డిజైనింగ్‌లో పట్టా పొందిన కీర్తి సురేష్ గీతాంజలి అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ఇక్కడ క్లిక్ చేయండి..