ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో మహానటి కీర్తి సురేశ్ కూడా ఒకరు.
గతంలో కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ప్రాధాన్యమిచ్చిన ఈ ముద్దుగుమ్మ సర్కారు వారి పాట వంటి సినిమాల్లో గ్లామరస్ పాత్రలు చేసింది.
ఇలా ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, మరోవైపు స్టార్ హీరోల పక్కన హీరోయిన్స్ గా నటిస్తూ బిజిబిజీగా ఉంటోందీ అందాల తార.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు డిజిటల్ రంగంలోకి కూడా అడుగుపెడుతోంది. మొదటగా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుందీ సొగసరి.
అక్కా అనే వెబ్ సిరీస్ లో బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టేతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది కీర్తి సురేశ్. ధనరాజ్ శెట్టి దర్శకత్వం వహించారు.
ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం కేరళలో మకాం పెట్టిన కీర్తి సురేష్ ఆ వివరాలను తాజాగా తన సామాజిక ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంది.
సుమారు 40 రోజులు వనవాసం పూర్తి చేసి ఇప్పుడే సోషల్ మీడియాలోకి తిరిగివచ్చానని చెప్పిన కీర్తి అక్కా వెబ్ సిరీస్‌లో నటించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.
వెబ్ సిరీస్ షెడ్యూల్‌ని ముగించుకుని ఇంటికి తిరిగి రావడం సరి కొత్త అనుభూతి నిచ్చిందని, ఇకపై ఇతర సినిమా షూటింగ్‌లకు హాజరవుతానంది కీర్తి.