కీర్తి @ 10 ఇయర్స్..

16 November 2023

తెలుగులో నేను శైలజ చిత్రంతో అరంగేట్రం చేసిన కీర్తి సురేష్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తర్వాత నాచురల్ స్టార్ నానికి జోడిగా నేను లోకల్ చిత్రంలో కథానాయకిగా అందం, అభినయంతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత మహానటి అనే తెలుగు చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించింది. ఈ చిత్రంతో నేటితరం మహానటి అయిపొయింది.

2022లో మహేష్ బాబుకి జోడిగా సర్కార్ వారి పాట చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.

2023లో దసరా చిత్రంలో మొదటిసారి పూర్తి డిగ్లామర్ పాత్రలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి పాన్ ఇండియా హిట్ అందుకుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎన్ని హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో కథానాయకిగా పదేళ్లే ప్రయాణం పూర్తి చేసుకుంది.

2013లో నవంబర్ 14న వచ్చిన మలయాళీ హార్రర్ సినిమా గీతాంజలిలో తొలిసారి హీరోయిన్ గా కనిపించింది. ఇది పదేళ్లు పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా పైలట్స్, అచనేయనేనికిష్టం, కుబేరన్ చిత్రాల్లో నటించిన ఈ చిత్రంతో హీరోయిన్ అయింది.