17 October 2024

విమర్శలను నటనతో తిప్పికొట్టిన మహానటి.. ఇది కీర్తి సినీ ప్రయాణం..

Rajitha Chanti

Pic credit - Instagram

అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ కీర్తి సురేష్. 

సినీ నేపథ్య కుటుంబం నుంచి బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఎన్నో విమర్శలు, సవాళ్లను ఎదుర్కోని తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. 

ఐరెన్ లెగ్ ముద్ర నుంచి బయటపడి ఈతరం మహానటి అనిపించుకుంది. ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ ప్రయణం ఇది.

మోహన్ లాల్ నటించిన గీతాంజలి సినిమాతో 2013లో సినీరంగంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు ఆమె మూడు సినిమాలు ఆగిపోయాయి. 

గీత, అంజలిగా తొలి ప్రయత్నంలోని ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్న ఆ సినిమా నిరాశపరిచింది. దీంతో ఆమెకు ఐరెన్ లెగ్ ముద్ర పడింది. 

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి.. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాన్నీ అందుకుంది ఈ బ్యూటీ. 

మహానటి సినిమాలో అలనాటి హీరోయిన్ సావిత్రిని మరిపించింది. ఇందులో ఆమె నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. 

కథానాయికగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగానూ రాణిస్తుంది. ఇటీవల కల్కి సినిమాలో బుజ్జి వాహనాన్ని వాయిస్ అందించింది కీర్తి సురేష్.