కీర్తి సురేష్ ఆస్తులు అన్ని కోట్లా !! 

TV9 Telugu

09 April 2024

కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగులో మహానటి సినిమాతో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

కీర్తి సురేష్ బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. మలయాళం సినిమా అయిన 'గీతాంజలి' మూవీతో క‌థానాయిక‌గా పరిచయమైంది.

ఇక్కడ కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడం వల్ల ఈ ముద్దుగుమ్మ మంచి ప్రోత్సాహం లభించింది.

తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు తెచ్చుకుంది.

ఇక తెలుగులో  కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ రామ్ పోతినేని హీరోగా చేసిన 'నేను శైలాజా' నటించి తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది.

ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఆస్తులు బాగానే వెన‌కేసిందనే చెప్పాలి. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం.

వ‌చ్చిన సంపాద‌న‌లో మ్యూచువ‌ల్ ఫండ్స్, రియ‌ల్ ఎస్టేట్స్ వ్యాపారాల్లో కీర్తి సురేష్ పెట్టుబడులు పెట్టిన‌ట్టు స‌మాచారం.

ఈ లెక్క‌న కీర్తి సురేష్ దాదాపు రూ.100 కోట్ల వ‌ర‌కు కేవ‌లం సినిమాల ద్వారా ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టు స‌మాచారం.