జూ.ఎన్టీఆర్‌కు  బాధ వస్తే ఆ పని చేస్తాడట..

Phani.ch

11 May 2024

ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. 

అయితే ప్రస్తుతం కీరవాణి ఓ ఇంటర్వ్యూలో జూ. ఎన్టీఆర్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.

కీరవాణి సంగీతం అందించిన అద్భుతమైన చిత్రాల్లో మాతృదేవో భవ చిత్రం కూడా ఒకటి. ఆ మూవీలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే సాంగ్ కీరవాణికి చాలా ఇష్టం అట. 

ఆ సాంగ్ ని ఒకసారి పాడండి అని యాంకర్ అడిగితే కీరవాణి  నేను ఆ పాట ఎక్కడ పడితే అక్కడ పాడను. ఎందుకంటే జూ. ఎన్టీఆర్ కి మాట ఇచ్చా అని చెప్పారు.

అసలు విషయానికి వస్తే తారక్ కి కూడా అది చాలా ఇష్టమైన పాట. తాను బాధలో ఉన్నప్పుడు ఆ పాట వింటుంటానని తారక్ తనతో చెప్పినట్లు కీరవాణి అన్నారు. 

ఒకసారి తారక్ పుట్టినరోజున ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తుండగా.. ఆ పాట గుర్తొచ్చింది. వేంటనే ఆ సాంగ్ ని నేను పాడి క్యాసెట్ లో రికార్డ్ చేసి తారక్ కి ఇచ్చాడట కీరవాణి.

అప్పుడు తారక్ నా దగ్గర మాట తీసుకున్నాడు. తాను ఉన్న చోట తప్ప ఇంకెక్కడా ఈ సాంగ్ పాడకూడదని అడిగాడు. బర్త్ డే రోజున తారక్ కోరడంతో మాట ఇచ్చేశా అని తెలిపారు కీరవాణి.