ఒక్క జోనర్‌కు మాత్రం కీరవాణి పెద్దన్న..

25 October 2023

తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా ఉండొచ్చు కానీ కీరవాణి మాత్రం సమ్‌థింగ్ డిఫెరెంట్. ఆయన తర్వాత ఎంతమంది సంగీత దర్శకులు వచ్చినా కూడా..

ఒక్క జోనర్‌కు మాత్రం కీరవాణి పెద్దన్న అయిపోయారు. అదే సోషియో ఫాంటసీ. ఈ జోనర్ అంటే చాలు.. ఎందుకు మన హీరోలు, దర్శకులు కేవలం కీరవాణిని మాత్రమే తీసుకుంటున్నారు..? సీక్రేట్ ఏంటి..?

కమర్షియల్ సినిమాలకు సంగీతం అందించడం కంటే.. సోషియో ఫాంటసీలకు మ్యూజివ్ ఇవ్వడం కష్టం. ఎందుకంటే ఆ జోనర్ సినిమాలకు ఎక్కువగా BGMతోనే పని.

రీ రికార్డింగ్ ఎంత అద్భుతంగా ఉంటే.. సినిమా రేంజ్ కూడా అంత పెరుగుతుంది. సరిగ్గా ఈ విషయంలోనే కీరవాణి ఎక్కువ స్కోర్ చేస్తున్నారు. సోషియా ఫాంటసీలకు ఈయన కేరాఫ్ అడ్రస్ అయిపోతున్నారు.

రాజమౌళి సినిమాల్లో పాటలు ఎలా ఉన్నా.. ఆర్ఆర్ మాత్రం అదిరిపోతుంది. కేవలం తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనే సినిమా స్థాయి పెంచేస్తుంటారు కీరవాణి.

అందుకే ఎంత పెద్ద సినిమా తీసినా.. జక్కన్న మరో మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడరు. అలాగే మిగిలిన డైరెక్టర్స్ కూడా సోషియో ఫాంటసీ అంటే కీరవాణినే చూస్తున్నారు. తాజాగా వశిష్ట, చిరు సినిమాకు ఈయనే సంగీత దర్శకుడు.

దాదాపు 30 ఏళ్ళ తర్వాత చిరంజీవి సినిమాకు సంగీతం అందిస్తున్నారు కీరవాణి. గతంలో సినిమాని పాటల రికార్డింగ్‌తోనే మొదలుపెట్టేవారు.

ఇప్పుడు మళ్ళీ పాత సంప్రదాయాన్ని ఫాలో అయ్యారు. ఇందులో 6 పాటలుంటాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరంజీవి చేస్తున్న అడ్వంచరస్ సోషియో ఫాంటసీ సినిమా ఇది.