‘శ్వాస మీద ధ్యాస.. వస్తున్నాం’ అంటూ ‘కీడా కోలా’.. 

తరుణ్‌ భాస్కర్‌ నటిస్తూ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, రఘు రామ్, రవీంద్ర విజయ్, చైతన్య రావు మాదాడి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కె. వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్‌ కౌశిక్, శ్రీ పాద్‌ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తరుణ్‌ భాస్కర్‌  లోకల్‌ డాన్‌గా, బ్రహ్మానందం వినోదాత్మక పాత్రలో ఆకట్టుకోనున్నారు.

తాజాగా బుధవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఏంట్రా అది అంటూ బ్రహ్మానందం మాటలతో మొదలైన ఈ టీజర్‌ ఆకట్టుకొనేలా ఉంది.

‘శ్వాస మీద ధ్యాస.. వస్తున్నాం’ అంటూ టీజర్‌ను ముగించారు.

కాగా ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మూవీ మేకర్స్.