అలాంటి పాత్రలు చేయాలనుంది: కావ్య తాపర్‌.. 

07 October 2024

Battula Prudvi 

గోపీచంద్‎ హీరోగా వస్తున్న విశ్వం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఈ చిత్ర హీరోయిన్ కావ్య తాపర్ తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గున్నారు.

ఇందులో సినిమా గురించి తనకి చేయాలనున్న పాత్ర గురించి తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఏమన్నారో తెలుసుకుందాం.

'విశ్వంలో కాస్ట్యూమ్‌ డిజైనర్‌ స్టైలిష్‌ పాత్రలో కనిపిస్తూనే కాస్త గ్రే షేడ్‌ లో కూడా చేశాను. నటనకు ప్రాధాన్యమున్న గ్లామర్‌ పాత్రి కావడంతో కాస్త సవాల్‌గా అనిపించింది' అంది కావ్య.

'అలాగే సినిమాలో నా ఫ్యామిలీగా నరేశ్, ప్రగతిల పాత్రలూ వినోదాత్మకంగా ఉంటాయి. ట్రైన్‌ ఎపిసోడ్‌ చాలా కొత్తగా.. అందర్నీ అలరించేలా ఉంటుంది’ అని తెలిపింది.

'జయాపజయాలు నియంత్రించడం నా చేతుల్లో లేదు. నా పాత్రకు నటిగా వంద శాతం న్యాయం చేశానా? లేదా? అనే చూసుకుంటా' అని చెప్పింది ఈ బ్యూటీ.

'నాకు ఇచ్చిన పాత్ర కోసం ఎంత కష్టానికైనా వెనకాడను. మిగిలింది దేవుడిపై భారం వేస్తా' అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

'ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్‌ పాత్రలే చేశా. కానీ, నటిగా నాకు అన్ని రకాల పాత్రలు పోషించాలని ఉంది' అని చెప్పింది.

'సైకో, దెయ్యం లాంటి సవాల్‌ విసిరే పాత్రలు చేయాలని ఉంది. తాజాగా 3 చిత్రాలకు ఓకే చెప్పను. త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది' అని తెలిపింది.